అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు: సంచలన వ్యాఖ్యలు చేసిన గోవర్దన పిఠాధిపతి నిశ్చలానంద సరస్వతి

ayodhya temple
శ్రీ| Last Modified గురువారం, 21 నవంబరు 2019 (17:45 IST)
అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై గోవర్దన పిఠాధిపతి నిశ్చనాలంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే... సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగా లేదు. రామమందిరంకు స్థలం కేటాయించడం సబబే. ఇతర మతాల వారికి స్థలం కేటాయించే అధికారం సుప్రింకోర్టుకి ఎక్కడిది. స్థల వివాదంలో ఆ స్థలం ఎవరిదో చెప్పాలి కాని... మరో స్థలం వారికి కేటాయించమని ఎలా చెబుతారు.

రేపు మధుర, కాశీ అంశాలపై ఇలానే తీర్పు ఇచ్చి.... ఆ ప్రాంతాన్ని మినీ పాకిస్థాన్‌లా మార్చేస్తారా? పి.వి నరశింహరావు హయాంలోనే 2.7 ఎకరాల స్థలం చెరి సమానంగా పంచాలన్న ప్రతిపాదన వచ్చింది. అందరూ అంగీకరించినా నేను అంగీకరించకపోవడంతో ప్రతిపాదన వెనక్కి వెళ్ళింది.

సెక్యూలరిజం పేరుతో ప్రభుత్వాలు మఠాధిపతులను నియంత్రిస్తున్నాయి. శంకరాచార్యులు దేశాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. అయోధ్య పూరి పీఠం పరిధిలోకి వస్తుంది. రామజన్మ భూమి కమిటిలో ప్రభుత్వానికి వత్తాసు పలికే వారికి చోటు కల్పిస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మఠాలును ప్రక్కన పెట్టి రవిశంకర్ లాంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సబబు కాదు.

ధర్మాన్ని ధర్మాచార్యులు చెప్పాలి కాని ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నాయి. కమ్యునిస్టులు వ్రాసిన పుస్తకాలు చదువుతున్న వారు అధికారులు అవుతుండటంతో వేదాలు మరుగునపడిపోతున్నాయి. 1133 శాఖలో వున్నా వేదాలు ఇప్పుడు 7 శాఖలకు పడిపోయింది. సెక్యూలరిజం పేరుతో బెనారస్ యూనివర్శిటీ డీన్‌గా ఇతర మతస్థుడిని నియమించడం ఎంతవరకు న్యాయం? అంటూ ప్రశ్నించారు.
దీనిపై మరింత చదవండి :