శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (20:26 IST)

శబరిమల, రఫేల్ కేసులపై రేపు సుప్రీం తీర్పు

దేశంలోనే అత్యంత సున్నితమైన అయోధ్య కేసు తీర్పును శనివారం వెలువరించింది సుప్రీం కోర్టు. మరో మూడు కీలక కేసులపై రేపు అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది.

రఫేల్ ఒప్పందం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోర్టు ధిక్కరణ కేసులపై తీర్పునివ్వనుంది సర్వోన్నత న్యాయస్థానం. వీటిల్లో రఫేల్, శబరిమల సమీక్షా వ్యాజ్యాలు. శబరిమల కేసు... శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గతేడాది సెప్టెంబర్లో సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీం.

అనాదిగా ఉన్న ఆనవాయితీని అత్యున్నత న్యాయస్థానం మార్చడంపై కేరళవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శబరిమల ఆలయ వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం జోక్యానికి వ్యతిరేకంగా 65 పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిలో 56 రివ్యూ పిటిషన్లు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం... ఈ ఏడాది ఫిబ్రవరి 6న తీర్పును వాయిదా వేసింది.