శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:15 IST)

శబరిమల ఆలయ నిర్వాహణకు ప్రత్యేక చట్టం.. మహిళా యాత్రికులకు?

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక చట్టం అమలులోకి రానుంది. అంటే ఈ చట్టం ఆలయ నిర్వహణ కోసమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా చివరిదశలో వుందని కేరళ సర్కారు వెల్లడించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వ న్యాయమూర్తి ఆగస్టు 27న వివరణ ఇచ్చినట్లు సుప్రీం పేర్కొంది. 
 
కానీ ఈ కొత్త చట్టం శబరిమల ఆలయాన్ని కాకుండా, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాలకు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానంలో పేర్కొన్నట్లు రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాది జి. ప్రకాష్‌ మీడియాకు తెలిపారు. 
 
కానీ ఈ చట్టంలో మహిళా యాత్రికులకు సంబంధించిన ప్రతిపాదన ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ట్రావెన్ కోర్ బోర్డు నేతృత్వంలో శబరిమలతో పాటు 150 దేవాలయాలున్న సంగతి తెలిసిందే.