అక్కను ప్రేమించి పెళ్లాడాడు... ఆమె చెల్లెలిపై కన్నేసి రేప్ చేశాడు...

Last Modified గురువారం, 29 ఆగస్టు 2019 (16:33 IST)
ఒంగోలులో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఆరోగ్యం సరిగా లేదన్న సాకుతో కామాంధుడయ్యాడు ఆ భర్త. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదన్న సాకుతో మరదలిపై కన్నేసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఐదేళ్ల క్రితం సుధాకర్ అనే యువకుడు ఒంగోలుకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆమె ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో పుట్టింటికి వెళ్లింది. ఇతడు కూడా భార్య ఆరోగ్యాన్ని చూసుకునేందుకంటూ అక్కడికి వెళ్లాడు. ఐతే అక్కడికెళ్లిన అతడు డిగ్రీ సెకండీయర్ చదువుతున్న మరదలిపై కన్నేశాడు. మీ అక్కకు ఆరోగ్యం సరిగా లేదనీ, తనతో సహకరించి తన కోర్కె తీర్చాలని లైంగికంగా వేధించాడు.

ఆమె ససేమిరా అన్నప్పటికీ బలవంతంగా ఆమెపై లైంగిక దాడి చేసి అత్యాచారం చేశాడు. విషయాన్ని బయటకు చెబితే మీ అక్క, అమ్మ, నాన్నలను చంపేస్తానని బెదిరించాడు. దాంతో ఆమె లోలోపల కుమిలిపోయింది. ఈలోపు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలను చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్, తన భార్య, మరదలిపై వాదనకు దిగాడు.

తనకిచ్చి ఆమెను రెండో పెళ్లి చేయాలనీ, లేదంటే తనవద్ద మరదలితో గడిపిన దృశ్యాలను బయటపెడతానంటూ బెదిరించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :