సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (11:47 IST)

అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన బీజేపీ కేంద్ర మాజీ మంత్రి

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై ఓ న్యాయ విద్యార్థిని సంచలన ఆరోపణలు చేసింది. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశారంటూ ఆరోపించారు. అలా ఆరోపణలు చేసిన మరుక్షణమే ఆ విద్యార్థిని అదృశ్యమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని ఎస్‌ఎస్‌ న్యాయ కాలేజీ విద్యార్థికి  చెందిన చిన్మయానంద్‌ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. 
 
'నాది షాజహాన్‌పూర్‌. నే ను ఎస్‌ఎస్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నాను. ఓ స్వామిజీ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు. అతనికి వ్యతిరేకంగా నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. 
 
మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ నన్ను ఆదుకోవాలి. నాకు న్యాయంచేయండి' అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. శుక్రవారం ఈ వీడియో షేర్‌ చేసిన విద్యార్థిని.. శనివారం నుంచి అదృశ్యమైంది. 
 
ఇదిలావుంటే, న్యాయ విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు స్వామి చిన్మయానంద్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కిడ్నాప్‌, బెదిరింపుల కేసును నమోదు చేశారు. అయితే బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నట్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.