శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (12:33 IST)

అయోధ్య తీర్పు: హిందువులదే రామజన్మభూమి- సుప్రీంకోర్టు

బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని బాబ్రీ నిర్మాణం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మోహి అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరుచూ మాటమార్చిందన్నారు. మసీదు కింద 12వ శతాబ్దం నాటి భారీ పురాతన కట్టడ ఆనవాళ్లు ఉన్నాయన్న ఏఎస్ఐ వాదనలను తోసిపుచ్చలేమని వెల్లడించారు. 
 
అయితే అది రామాలయమని ఏఎస్ఐ ఆధారాలు చూపలేదన్నారు. మొగల్ చక్రవర్తి బాబర్ దగ్గర పని చేసిన సైనికాధికారులు మసీదును నిర్మించారని చెప్పుకొచ్చారు. బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీపై స్పష్టత లేదని, విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేశారని సీజేఐ అన్నారు.
 
ఇంకా అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది.