శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 12 డిశెంబరు 2019 (20:27 IST)

150 మంది ఒక్కసారే వస్తే ఏం చేస్తావ్ బాబు.. రోజా ప్రశ్న?

ఫైర్ బ్రాండ్ రోజా అసెంబ్లీ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడును తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మగధీర సినిమాలో డైలాగ్‌లు వదులుతున్న బాబు ఎందుకలా మాట్లాడుతున్నావ్.. 150 మంది ఒక్కసారే వస్తే నువ్వు ఏం చేస్తావ్.. అందరికీ సమాధానం చెప్పగలవా అంటూ ప్రశ్నించారు రోజా.
 
చంద్రబాబుకు వయస్సు మీద పడేకొద్దీ చాదస్తం పెరిగిపోయిందని విమర్శించారు. బాబు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను నిబంధనలకు విరుద్ధంగా సభ నంచి యేడాది పాటు సస్పెండ్ చేశారని రోజా గుర్తు చేసుకున్నారు. 
 
సభలో అడుగుపెట్టకుండా తనను మార్షల్ అప్పట్లో అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే బోండా ఉమ నిండు సభలో మీ అందరినీ పాతిపెడతానని చెప్పారు. అప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు రోజా.