సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (14:48 IST)

జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వెనుక మోదీ తంత్రం వుంది: జేసీ

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వెనుక మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తంత్రం వుందని చెప్పారు. వైసీపీకి చెందిన అభ్యర్ధులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించలేదన్నారు. ఒక్కో అభ్యర్ధి వేలాది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం వెనుక మోడీ తంత్రం ఉందన్నారు. 
 
ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు మంచి వ్యూహాకర్తలుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఇదే కోవలోకి వస్తారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
అంతేగాకుండా భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయవచ్చని జేసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కాని ఉండరని జేసీ తేల్చి చెప్పేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని తేల్చి చెప్పారు. 
 
రాష్ట్రంలో టీడీపీకి బీజేపీ తలుపులు మూసివేసిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై జేసీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేమన్నారు. చంద్రబాబునాయుడు ఎవరి జుట్టు పట్టుకొంటాడో ఇంకేం చేస్తారో తెలియదన్నారు. రానున్న రోజుల్లో  బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.