చిరు-జగన్ భేటీ: మీరు గ్రేట్ సిఎం, అంతకుమించి గ్రేట్ యాక్టర్ మీరు

Jagan-Chiru
జె| Last Modified సోమవారం, 14 అక్టోబరు 2019 (15:48 IST)
మెగాస్టార్ చిరంజీవి.. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిలు కలవడం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆసక్తి రేకెత్తిస్తోంది. సైరా నరసింహారెడ్డి సినిమాను బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు ప్రభుత్వం అప్పట్లో అనుమతిచ్చింది. అందులోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపించడమే కాకుండా ఏ సినిమాకు బెనిఫిట్ షో అవకాశం ఇవ్వకుండా ఈ సినిమాకు మాత్రమే ఇచ్చారు.

సైరా సినిమా కాస్త భారీ విజయాన్ని సాధించింది. సినిమా విజయంతో చిరంజీవి, రామ్ చరణ్‌లు సంతోషంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆప్యాయంగా పలకరించారు. పుష్పగుచ్ఛాలను సిఎంకు అందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి, మీరు గ్రేట్ సిఎం అంటూ భుజాన్ని తట్టారు. సర్.. మీరు గ్రేట్ యాక్టర్ అంటూ కరచాలనం చేశారు జగన్మోహన్ రెడ్డి. మర్యాదపూర్వకంగానే చిరంజీవి సిఎంను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్‌ను చిరంజీవి కలవలేదని, ప్రస్తుతం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారన్న ప్రచారం జరుగుతోంది.దీనిపై మరింత చదవండి :