సైరాలో అనుష్క.. థ్యాంక్స్ చెప్పిన చెర్రీ.. సూపరన్న డార్లింగ్..

సెల్వి| Last Updated: ఆదివారం, 13 అక్టోబరు 2019 (16:09 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా నటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ కావడంతో ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు రామ్ చరణ్.

అంతేగాకుండా ఈ సందర్భంగా అనుష్కకు థాంక్స్ చెప్పారు. ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క కథకు కీలక మలుపు తిప్పే పాత్రలో నటించారని కొనియాడారు. గతంలో రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిగా మెప్పించిన అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి‌గా కనిపించింది.

సైరాలో అనుష్క రోల్‌పై ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. బాహుబలిలో దేవసేనకు తర్వాత ఝాన్సీగా అనుష్క కనిపించడం సూపర్ అంటూ కొనియాడాడు.దీనిపై మరింత చదవండి :