శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (15:07 IST)

కనకవర్షం కురిపిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' ... 7 రోజుల్లో రూ.191 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "సైరా నరసింహా రెడ్డి", దేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 
 
ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విజయవిహారం చేస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం గడచిన ఎనిమిది రోజుల్లో 90 కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది. 
 
అదేసమయంలో సైరా చిత్రానికి పోటీగా భావించదగిన సినిమాలేవీ సమీపంలో లేవు. చాణక్య రూపంలో గోపీచంద్ వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఈ వారాంతంతో పాటు మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తెలుగులోనేకాకుండా విడుదలైన మిగతా భాషల్లోనూ ఈ సినిమా విజయకేతనాన్ని ఎగరేస్తూ ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏడు రోజుల్లో 191 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ప్రముఖ ట్రేడ్ అనలిస్టు గిరీష్ జోహార్ వెల్లడించారు. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.124 కోట్లు, కర్నాటకలో రూ.23 కోట్లు తార్నాక్ ఏరియాలో రూ.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.26 కోట్లు చొప్పున వసూలు చేసినట్టు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.