విజయ్ గురించి తెలియదా? తమన్నాను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..
కోలీవుడ్ మెర్సల్ హీరో విజయ్ గురించి మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన కామెంట్లు ప్రస్తుతం వివాదానికి తెచ్చిపెట్టాయి. విజయ్ గురించి తనకు తెలియదంటూ తమన్నా చేసిన వ్యాఖ్యలు విజయ్ ఫ్యాన్స్‌ను హర్ట్ అయ్యేలా చేశాయి. దీంతో మిల్కీ బ్యూటీ తమన్నాపై తమిళ అగ్ర హీరో విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్‌కు తమన్నా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ ఫ్యాన్స్ ప్రస్తుతం తమన్నాను ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల 'పెట్రోమాక్స్' ప్రమోషన్ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన తమన్నాకు హీరో విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. ''విజయ్ గురించి మీ స్పందన ఏంటి?" అంటూ తమన్నాను యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన తమన్నా.. "ఆయన గురించి నాకేం తెలియదు. ఒక సినిమాలో ఆయనతో కలిసి నటించాను.
కానీ, ఆ సమయంలో ఆయనకు, నాకు మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ లేదు. ఆయన పనేదో ఆయనది అన్నట్టు ఉండేవారు. షూటింగ్‌కు వెళ్లామా? వచ్చామా? అన్నట్టు ఉండేది. అలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడను. ఆయన గురించి ఏమీ తెలియకుండా కామెంట్ చేయలేను" అంటూ కామెంట్స్ చేసింది.