బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 5 అక్టోబరు 2019 (21:45 IST)

కొత్త లుక్‌తో అదరగొడుతున్న హీరో విజయ దేవరకొండ

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాడు. తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీవేర్ కోసం చేసిన ఫొటో షూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. తన యాట్యిటూడ్‌తో యూత్‌లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు.
 
ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది.  ఒక సెలబ్రిటీ ఇమేజ్‌తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టెట్ మెంట్స్‌తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 
 
ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్‌లోకి కూడా తన మార్క్‌ని చూపబోతుంది. త్వరలోని విస్తరించబోతున్న స్ట్రీట్ వేర్ బ్రాండ్ ఫుట్‌వేర్ రంగంలో కొత్త వాయిస్‌గా మారబోతుంది.