మేడం నమస్తే, అమ్మా... నన్ను మేడం అనొద్దండి, మీ కూతురులాంటిదాన్ని.. ఎవరు?

chiru-jagan
జె| Last Modified సోమవారం, 14 అక్టోబరు 2019 (15:14 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి- మెగాస్టార్ చిరంజీవి భేటీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్. అయితే వీరితో పాటు చిరంజీవి సతీమణి, సీఎం జగన్ సతీమణి వై.ఎస్.భారతిలు కూడా ఇరువురు భేటీ అయిన సందర్భంలో ఉన్నారు. చిరు, జగన్‌లు ఒకరినొకరు పుష్పగుచ్ఛాలు ఇచ్చుకునే సమయంలో చిరంజీవి సతీమణి సురేఖ, జగన్ భార్య వై.ఎస్.భారతిల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయట.

వై.ఎస్.భారతిని, మేడం నమస్తే అంటూ విష్ చేస్తూ సురేఖ మెల్లగా నవ్వారట. దీంతో వై.ఎస్.భారతి వెంటనే మీరు నన్ను మేడం అని పిలుస్తున్నారేంటి? అమ్మ.. మీరు నాకు అమ్మతో సమానం. నాకు మీ కూతురు వయస్సు.. భారతి అని పిలవండి అన్నారట. దీంతో సురేఖ మెల్లగా నవ్వి సైలెంట్‌‌గా ఉండిపోయారట. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర వ్యాఖ్యలను చూసి చిరంజీవి, జగన్‌లు కూడా ముసిముసినవ్వులు నవ్వుకున్నారట.దీనిపై మరింత చదవండి :