మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (13:45 IST)

మరో క్రేజీ ప్రాజెక్టులో మెగాస్టార్... తనయుడితో కలిసి టాప్ డైరక్టర్ దర్శకత్వంలో..

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మెగా ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ జోష్ తగ్గకముందే కొరటాల శివతో చేయనున్న సినిమాను చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. 
 
కొరటాల శివ సెన్సుబుల్ డెరెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్ జోడించి.. అతడు స్టార్ హీరోలతో  తీసిన సినిమాలు బంపర్ హిట్లు అందుకున్నాయి.  ఇంతవరకూ ఒక్క ప్లాపు కూడా తీయకుండా సెంట్ పర్సెట్ సక్సెస్ రేటుతో ముందుకు సాగుతున్నారు. దీంతో మెగాస్టార్‌కు కూడా పక్కా హిట్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. 
 
ఇకపోతే రామ్ చరణ్.. మెగా అభిమానుల కోసం మరో క్రేజీ న్యూస్‌ని తీసుకొచ్చాడని ఫిలిం సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'లూసిఫర్'. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
 
అయితే ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా? అని ఆసక్తికర చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా సుకుమార్ పేరు ట్రాక్‌లోకి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ "రంగస్థలం" వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. మహేశ్ బాబుతో మూవీ చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సుకుమార్..బన్నీతో సినిమా కమిట్ అయ్యాడు. అది పూర్తయిన తర్వాత చిరంజీవి మూవీని టేకోవర్ చేయనున్నారట. ఈలోపు కొరటాల శివ మూవీని పూర్తి చేయనున్నారు. 
 
ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని సమాచారం. రామ్ చరణ్ నటించిన 'బ్రూస్లీ' సినిమాలో చిరు గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో కూడా చిరంజీవితో కలిసి రామ్ చరణ్ స్టెప్పులేశాడు. ఈ రెండు సినిమాలు సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేశాయి. ఈ మెగా డ్యుయో కాసేపు కనిపిస్తేనే ఇలా ఉంది అంటే.. ఫుల్ లెంగ్త్‌లో మెగాస్టార్, మెగాస్టార్ పవర్‌స్టార్ కలిస్తే.. ఇక రచ్చరంబోలానే.