టాలీవుడ్‌కు వచ్చే ఉత్తరాది హీరోయిన్ల ఇళ్లు చూస్తే వారం రోజుల పాటు... అంటున్న మోహన్ బాబు

Mohan Babu
ఐవీఆర్| Last Modified బుధవారం, 20 నవంబరు 2019 (19:43 IST)
ఉత్తరాది నటీనటులను టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి నటింపజేయడంపై ఇప్పటికే సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో నటీనటులు లేరనా అక్కడికి వెళ్తున్నారూ అంటూ మండిపడ్డారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉత్తరాది నుంచి వస్తున్న హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు.

ఉత్తరాది హీరోయిన్లు తెల్లగా వుంటారని ఇక్కడి నిర్మాతలు సెలక్ట్ చేస్తుంటారు. అసలు ఉత్తరాదికి చెందిన హీరోయిన్ వుండే ఇల్లు చూస్తే వారం రోజులు అన్నం తినలేం. అంతా దారుణంగా వుంటుంది. అలాంటి ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నవారు హీరోయిన్లై ఇక్కడి వారికే కండిషన్లు పెడుతుంటారు. దీనితో వారిని అడుక్కోవలసి వస్తుంది.

ఇది ఏ ఒక్కరో కాదు, అలాంటి నిర్మాతల్లో మేం కూడా వున్నాం. అసలిప్పుడు ఇండస్ట్రీ పాడయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. మరి ఏ ఉత్తరాది హీరోయిన్ ఇల్లు అంత దారుణంగా వుందో?దీనిపై మరింత చదవండి :