నిర్మాతగా మారిన టాలీవుడ్ హీరో... కొత్త టాలెంట్‌కు పెద్దపీట (video)

manchu manoj
ఠాగూర్| Last Updated: బుధవారం, 30 అక్టోబరు 2019 (18:25 IST)
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు మంచు మనోజ్. సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు తనయుడు. గత కొంతకాలంగా వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే మంచు మనోజ్ దంపతులకు విడాకులను కోర్టు మంజూరు చేసింది. దీంతో బిగ్ రిలీఫ్ పొందినట్టు చెప్పుకొచ్చాడు.

అదేసమయంలో ఇపుడు హీరో నుంచి నిర్మాతగా మారాడు. ఇందుకోసం ఎంఎంఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను నిర్మించాడు. మంచు మనోజ్ అనే పేరులోని మొదటి అక్షరం ఎంఎం కలిసివచ్చేలా ఈ నిర్మాణ సంస్థను నిర్మించాడు.

ఈ విషయాన్ని దీపావళి సందర్భంగా వెల్లడించాడు. తన సొంత బ్యానర్‌లో కొత్త ప్రతిభను పరిచయం చేస్తానని తెలిపాడు. మున్ముందు మహత్తరమైన సినిమాలు తన బ్యానర్ నుంచి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు.

దీనిపై మరింత చదవండి :