శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (18:43 IST)

ప్రణతితో వైవాహిక జీవితం ముగిసిపోయింది.. మంచు మనోజ్ షాక్

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన డాక్టర్ మంచు మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరు మంచు విష్ణు కాగా, మంచు మనోజ్ మరొకరు. అయితే, మంచు మనోజ్ అభిమానులకు తేరుకోలేని షాకిచ్చారు. తన భార్య ప్రణతితో వైవాహిక బంధం ముగిసిపోయిందని ఆయన ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. 
 
తన వదిన (మంచు విష్ణు) వెరోనిక ద్వారా పరిచయమైన ప్రణతి రెడ్డిని 2015 మే 20న పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్‌. గురువారం తన ట్విటర్‌ పేజ్‌లో ఓ ఎమోషనల్‌ మెసేజ్‌ను ట్వీట్ చేసిన మనోజ్‌, ప్రణతితో తన వైవాహిక జీవితం ముగిసిపోయిందని వెల్లడించాడు.
 
"నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను మీతో షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతో అందమైన మా వివాహ బంధం ముగిసింది. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. కొన్ని విభేదాల కారణంగా మేము ఎంతో బాధను అనుభవించాం. ఎంతో ఆలోచించిన తర్వాత విడివిడిగా ప్రయాణించటమే కరెక్ట్‌ అని నిర్ణయించుకున్నాం. ఒకరి మీద ఒకరం ఎంతో గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా ఈ నిర్ణయానికి మీద అందరి మద్దతుగా నిలిచివారి కృతజ్ఞతలు" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.