మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (12:06 IST)

అపార్ట్‌మెంట్ల కోసం ఓ చైనీస్ కుటుంబం ఏం చేసిందంటే? 11 సార్లు వివాహం... 23సార్లు విడాకులు

ఓ చైనీస్ కుటుంబం ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అటు తిరిగి ఇటు తిరిగి తమ కుటుంబంలోని వారినే పెళ్లాడారు. ఇలా ఆ కుటుంబంలో 11 మందికి వివాహం జరిగింది. పెళ్లి మాత్రమే కాదు. విడాకులు కూడా 23 సార్లు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. చైనాలో వివాహం చేసుకునే కొన్ని వర్గాలకు చెందిన వారికి 40 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ అందజేసే పథకం అమలులో వుంది. 
 
చైనాలోకి తూర్పు సైజింగ్ ప్రాంతంలో వివాహాలు చేసుకునే వారికి అపార్ట్‌మెంట్లు అందజేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన రాగానే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. తమ కుటుంబానికి చెందిన సభ్యుల్నే వేర్వేరు సమయాల్లో వివాహం చేసుకున్నారు. 23 సార్లు విడాకులు తీసుకున్నప్పటికీ వాటిని 11 వివాహాలు జరిగినట్లు లెక్క చూపారు. 
 
తోబట్టువులను వీరు పెళ్లి చేసుకోలేదు. వరుసైన వారినే  వివాహం చేసుకున్నారు. ఇంకా 11 వివాహాలు జరిగినట్లు లెక్క చూపారు. అంతేగాకుండా 23 సార్లు విడాకులు తీసుకున్న వారు కూడా మళ్లీ వివాహం చేసుకున్నట్లు సర్టిఫికేట్లు అందజేసి అపార్ట్‌మెంట్లు పొందాలనుకున్నారు. 
 
ఈ విషయాన్ని ఆ దేశ మీడియా పసిగట్టింది. చివరికి ఓ చైనా వార్తా పత్రిక ఆధారంగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.