భర్తపై కోపంతో 2 నెలల పసికందును ట్రాక్టర్ టైర్ కింద పడేసిన తల్లి (video)
తెలంగాణ లోని మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లెలో కన్నతల్లి దారుణానికి పాల్పడింది. భర్త మీద కోపంతో 2 నెలల పసికందును ట్రాక్టర్ టైర్ కిందకి విసిరేసింది. డబ్బు విషయమై భర్తతో తీవ్ర వాగ్వాదానికి దిగిన సంధ్య అనే మహిళ, కోపంలో బిడ్డను ట్రాక్టర్ చక్రాల కిందకు విసిరేసింది. ఐతే స్థానికులు సమయానికి ఆ బిడ్డను రక్షించారు.
స్నేహితురాలితో వివాహిత అసహజ సంబంధం
తమిళనాడులో విషాదకర సంఘటన జరిగింది. 5 నెలలు వయసున్న ఓ బాబు తల్లి పాలు తాగుతూ మృతి చెందాడు. తొలుత ఈ మరణం సహజ మరణం అనుకున్నారు. కానీ సదరు మహిళ భర్త తన భార్యపై చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసారు. తన భార్య కొడుక్కి విషపు పాలు ఇచ్చి చంపేసిందంటూ అతడు చేసిన ఆరోపణలతో అక్కడివారంతా షాకయ్యారు.
భర్త ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం... కృష్ణగిరి జిల్లాలోని చిన్నతి గ్రామంలో సురేష్, భారతి దంపతులు నివాసం వుంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వారిలో ఐదు నెలల చిన్న బాబు కూడా వున్నాడు. ఐతే సురేష్ భార్య భారతి ప్రవర్తన ఇటీవలి కాలంలో చాలా తేడాగా వుండటాన్ని గమనించాడు. గంటలకొద్దీ భారతి తన స్నేహితురాలు సుమిత్రతో గడుపుతోంది. వగతెగని ఫోన్ సంభాషణ చేస్తోంది. ఇది కాస్తా వారిమధ్య అసహజ సంబంధానికి దారి తీసింది. వారు ఏకాంతంగా కలుసుకునేందుకు ఆ చిన్నారి అడ్డుగా వున్నాడని బాబుకి విషంతో కలిపిన పాలు ఇచ్చి చంపేసిందంటూ భర్త ఆరోపణలు చేసాడు.
అంతేకాకుండా ఈమధ్య తన భార్య భారతి ఫోనులో సుమిత్రతో కలిసి అసభ్యకరంగా దిగిన ఫోటోలు, వారి సంభాషణలు కూడా బయటపడ్డాయి. వీటిని చూసిన భర్త షాక్ తిన్నాడు. తన భార్యే తన బాబును చంపేసిందంటూ ఆరోపిస్తున్నాడు. మృతి చెందిన బాబును పోలీసులు డిటైల్డ్ మెడికల్ రిపోర్ట్ కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సురేష్ భార్య భారతిని, ఆమె స్నేహితురాలు సుమిత్రను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.