గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (11:55 IST)

తిరుమలగిరిలో ఆరేళ్ల బాలుడికి కరోనా..

తిరుమలగిరి పట్టణంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్‌ రాగా, మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌ తేలింది. జిల్లాలో నమోదైన తొలి పాజిటివ్‌ కేసు వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వస్తూ మార్గమధ్యలో తిరుమలగిరిలోని ఓ ప్రార్థన మందిరంలో బస చేశాడు. అతడినుంచి ఈ ప్రార్థన మందిరంలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా అంటుకుంది.

ఇతనినుంచి ఇంటి పక్కనే ఉన్న మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు ధ్రువీకరించారు. తాజాగా పట్టణంలో చికెన్‌షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తికి వీరినుంచే వైరస్‌ అంటుకున్నట్లు తేలింది. అలాగే ఆత్మకూర్‌ మండలంలో ఏపూర్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది.
 
సూర్యాపేట పట్టణంలోని మార్కెట్‌ బజార్‌కు ఏపూర్‌కు చెందిన పాజిటివ్‌ వ్యక్తి తండ్రి ఇటీవల వెళ్లాడు. ఇతను మార్కెట్‌లో ఉంటున్న, ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యాపారికి డబ్బులు ఇచ్చాడు. ఇతని కుటుంబాన్నంతా ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించి నమూనాలను పరీక్షల కోసం పంపారు. తండ్రి, కుటుంబ సభ్యులు మినహాయిస్తే కుమారుడికి పాజిటివ్‌ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. ఆ కుమారునికి ఆరేళ్లే. కుటుంబంలో అందరికి నెగెటివ్‌ వచ్చి ఈ బాలుడికి పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు.