గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (08:56 IST)

న్యూయార్క్‌లో నెలరోజుల పాటు లాక్ డౌన్.. ఒక్కరోజే 606 మంది మృతి

Newyork
అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో అమెరికా అల్లకల్లోలంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు ఆరు లక్షలా 70వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఏకంగా 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఒక్క న్యూయార్క్‌లోనే ఐదు లక్షల కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 11,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మే 15 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో ప్రకటించారు. 
 
గడిచిన 24 గంటల్లో అంటే ఒకే రోజు ఏకంగా 606 మంది ప్రజలు కరోనాతో మృతి చెందారని చెప్పారు. అయితే గత పది రోజులుతో పోలిస్తే ఇది తక్కువ ప్రాణ నష్టమేనని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను నెల రోజుల పాటు విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజలు బయటకు వచ్చినప్పుడు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని లేదంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక న్యూయార్క్‌లో కరోనా వ్యాప్తి నెమ్మదించడంతో.. న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాలకు 100 చొప్పున వెంటిలేటర్లను అందజేయాలని గవర్నర్ ఆండ్రూ కువోమో నిర్ణయించారు.