శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:36 IST)

వామ్మో.. కరోనా వున్నా.. వేలాది మంది ఇలా రథాన్ని లాగారే..? (video)

karnataka
అవును.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. వేలాది మంది సిద్ధలింగేశ్వర రథాన్ని లాగుతూ కనిపించారు. ఈ వ్యవహారం కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ. 
 
కలబురగి జిల్లాలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను లెక్కచేయకుండా ప్రజలు ఒక మత సంబంధమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందలాది మంది సిద్ధలింగేశ్వర రథాన్ని లాగుతూ కనిపించారు. కలబురిగి జిల్లాలోని చిత్తపూర్ తాలూకాలో ఈ వేడుక జరిగింది. 
 
లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు.
 
కాగా, మార్చి నెలలో కలబురిగిలోనే దేశంలో తొలి కరోనా మరణం సంభవించడం గమనార్హం. కర్ణాటకలో గురువారం నాటికి మొత్తం 315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనాతో మరణించగా.. 82 మంది కోలుకున్నారు.