శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (10:30 IST)

మెడికల్ షాపుల్లో మద్యం విక్రయం.. యజమాని జైలుపాలు

లాక్‌డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, మందుల షాపులను రోజంతా తెరిచివుంచే వెసులుబాటువుంది. అయితే, ఓ మెడికల్ షాపు యజమానికి దురాశ పుట్టింది. లాక్‌డౌన్ సమయంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని భావించాడు. అదే అదునుగా భావించిన అతను.. మెడికల్ షాపులో మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ఇది చివరకు ఆ నోటా ఈ నోటా పడి పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు వచ్చి అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగపూర్, గణేష్‌పేట్ ప్రాంతంలో నిషాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36) అనే వ్యక్తి ఓ మెడికల్ షాపును నడుపుతున్నాడు. ఈయన తన షాపులోనే మద్యం అమ, తన షాపులోనే బీర్ అమ్మకాలు ప్రారంభించాడు. అదీకూడా మంచినీళ్ల బాటిల్స్‌లో బీర్‌ను నింపి ఆయన అమ్మకాలు ప్రారంభించాడు. 
 
ఈ విషయం ఆనోటా, ఈనోటా పాకి, చివరకు పోలీసులకు చేరడంతో వారు ఆకస్మికంగా తనిఖీలు చేయపట్టారు. ఈ తనిఖీల్లో లీటర్ల కొద్దీ బీర్ లభించింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. ఇదే కేసులో తప్పించుకున్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.