బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (17:24 IST)

47 ఏళ్లైనా పెళ్లి కాలేదు.. 15ఏళ్లుగా మహిళతో ఆ లింకు.. కన్నతల్లి అడ్డుగా వుందని?

అక్రమ సంబంధానికి కన్నతల్లి అడ్డంకిగా మారిన కారణంగా.. ఆమె కుమారుడు దారుణానికి ఒడిగట్టాడు. వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తుందని.. కన్నతల్లినే నిద్రమాత్రలు ఇచ్చి.. చీరను నోటిలో కుక్కి హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడు, సేలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా, అమ్మాపేటకు చెందిన కామరాజర్ కాలనీకి చెందిన రాజేంద్రన్ భార్య నల్లమ్మాల్ (65)కు 47ఏళ్ల వయస్సులో శివకుమార్ అనే కుమారుడు, లత అనే కుమార్తె వున్నారు. శివకుమార్‌కు 47 ఏళ్లైనా వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో లత కన్నతల్లి ఆరోగ్యం బాగోలేదని పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో నోటిలో చీరకుక్కి.. అనుమానస్పద రీతిలో తల్లి మృతి చెందిన విషయాన్ని గమనించి షాకైంది. 
 
ఇంతలో తల్లిని హతమార్చినట్లు శివకుమార్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జయలక్ష్మి అనే మహిళతో 15 సంవత్సరాల పాటు శివకుమార్‌కు వివాహేతర సంబంధం వుందని తెలిసింది. 
 
జయలక్ష్మి అప్పుడప్పుడు శివకుమార్ ఇంటికి తీసుకువచ్చేవాడని.. దీన్ని అతని తల్లి ఖండించిందని తెలిసింది. ఇలా తన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్న కన్నతల్లిని నిద్రమాత్రలు ఇచ్చి.. నోటిలో చీరను కుక్కి చంపేసినట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.