శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (16:35 IST)

పడకగది తలుపులు 'లాక్‌డౌన్' ... దేశంలో కండోమ్ సేల్స్ అదుర్స్

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో పేదోడి నుంచి పెద్దోడు (ధనవంతుడు) వరకు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇదే సమయంలో అనేక జంటలు తమ పడకగది తలుపులను 24 గంటల పాటు లాక్ చేసుకుని శృంగారంలో మునిగితేలుతున్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా కండోమ్స్ విక్రయాలు విపరీతంగా పెరిగిపోయినట్టు సమాచారం. 
 
తాజా సమాచారం మేరకు.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రైవేటు కంపెనీలతో పాటు.. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పలు జంటలు.. అటు కంపెనీ పనితో పాటు.. తమ దాంపత్య వర్క్‌లో నిమగ్నమైపోయారు. దీంతో కండోమ్స్ విక్రయాలు గతవారం ఏకంగా 25 నుంచి 50 శాతం మేరకు పెరిగినట్టు సమాచారం. 
 
అంతేకాకుండా, ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అధికప్రాధాన్యత ఇస్తున్నారట. అలాగే, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని భారీగా నిల్వచేసుకున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. వీటితో పాటు... డెటాల్స్, ఆల్కహాల్, శానిటైజర్లు తదితర వస్తువుల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగినట్టు సమాచారం. మొత్తంమీద లాక్‌డౌన్ పుణ్యమాని యువజంటలు శృంగార కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైపోయారనే విషయం తెలుస్తోంది.