శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (10:49 IST)

సీసీసీకి 'బిగ్ బి' విరాళం ... రూ.1.80 కోట్ల విలువైన ఓచర్లు

కరోనా వైరస్ సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనవంతగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ రంగంలోకిని పేద సినీ కళాకారులను ఆదుకున్నారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు కూడా తన వంతు సాయంచేశారు. ఇందులోభాగంగా రూ.1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ గిఫ్ట్‌లు ఓచర్లను పంపించారు. 
 
ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'అమితాబ్‌గారు, ఒక్కొక్కటి రూ.1500 విలువైన 12 వేల రిలీఫ్ కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం పంపించారు. వాటిని పంపిణీ చేయనున్నాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు 'బిగ్ బీ'కి బిగ్ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్లలో రిడీమ్ చేసుకోవచ్చు" అని చిరంజీవి తన ట్వీట్ ఖాతాలో పేర్కొన్నారు.