మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:55 IST)

దేశవ్యాప్తంగా 82 జిల్లాల్లో కొవిద్-19 పై సర్వే

కరోనా వైరస్‌పై మరింత అవగాహనకై దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న 82 జిల్లాల్లో ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో నేషనల్ సీరో-సర్వే ను నిర్వహించడం జరుగుతుందని భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ చెప్పారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొ.భార్గవ మాట్లాడుతూ కరోనా ఎక్కువగా ప్రబలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరింత విస్తృత అవగాహన కోసమే ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో ఈనేషనల్ సీరో సర్వేను నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా 82 జిల్లాలను ఈసర్వేకు ఎంపిక చేయగా ప్రతి జిల్లాలో ఒక్కరోజులోనే సర్వేను పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.10 రోజుల్లో ఈ చిన్నపాటి సర్వేను పూర్తి చేయడం జరుగుతుందని ఐసిఎంఆర్ డిజి బలరాం భార్గవ స్పష్టం చేశారు.

సర్వే నిర్వహణకు జిల్లాలకు వచ్చిన ఐసిఎంర్ సర్వే బృందాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చూడాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను డిజి బలరాం భార్గవ కోరారు.

వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సిఎం అదనపు సిఎస్ డా.పివి.రమేశ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర పాల్గొన్నారు.