1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:01 IST)

దేశంలో 5,00,542 శాంపిళ్ల పరీక్ష: ఐసీఎంఆర్

దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు దేశంలో మొత్తం 4,85,172 మంది నుంచి 5,00,542 శాంపిళ్లు తీసుకుని పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటన చేసింది. వారిలో  21,797 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయని ప్రకటించింది.
 
అయితే, దేశంలో ఈ రోజు ఉదయం వరకు 21,359 కేసులు నమోదయ్యాయని అంతకుముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 685 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 4,348 మంది కోలుకున్నారని వివరించింది.