బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:59 IST)

తుమ్మల గుంట ఆలయానికి పోటెత్తిన భక్తజనం

నూతన సంవత్సరాన్ని పురస్క రించుకుని శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గంలో వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. గ్రామాల్లో సందడి నెలకొంది.

గురువారం అర్థరాత్రి నుంచే చంద్రగిరిలో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమ్యాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ కొత్త ఏడాదిలో కి అడుగుపెట్టారు.

వేకువజాము నుంచే  తుమ్మలగుంట ఆలయానికి భక్తులు పోటెత్తారు. అభిషేక కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు కల్యాణ వెంకన్న దర్శన అవకాశాన్ని కల్పించారు. 

భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి తలకోనలోని సిద్దేశ్వర స్వామిని దర్శించుకున్నారు.