గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:18 IST)

త్వరలో పలువురు సీఐలకు డీఎస్పీ ప్రమోషన్లు

పోలీస్ శాఖలో సీఐలుగా పనిచేస్తున్న వారిలో డీఎస్పీలుగా ఉద్యోగోన్నతికి అర్హుల జాబితాను ఎంపిక చేశారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో కూడిన పదోన్నతుల కమిటీ సమావేశమై సీనియార్టీ ప్రాతిపదికన అర్హుల జాబితాను సిద్ధం చేసింది.

గుంటూరు రేంజ్‌ (గుంటూరు, నెల్లూరు, ప్రకాశం) పరిధిలో 15 మందికి స్థానం కల్పించారు. వారిలో ఖాళీలు ఆధారంగా ముందు వరుసలోని పలువురికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ రెండు, మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 
 
గుంటూరు రేంజ్‌ పరిధిలో అడహక్‌ డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి విభాగంలో సీఐలు ఆదినారాయణ, జి.శ్రీనివాసరావు, ఎన్‌.సురేష్‌బాబు, జె.శ్రీనివాసరావు, టి.మురళీకృష్ణ, టీవీ రత్నస్వామి, కె.రవికుమార్‌లు ఉన్నారు.

సూపర్‌ న్యూమరీ డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి విభాగంలో ఎన్‌.సురేష్‌కుమార్‌రెడ్డి, యు.రవిచంద్ర, ఎండీ అబ్దుల్‌ సుబానీ, బి.మోజెస్‌పాల్‌, టి.దిలీప్‌కుమార్‌, కె.సీహెచ్‌ రామారావు, పి.సాంబశివరావు, బి.రాజశేఖర్‌లు ఉన్నారు.