బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:16 IST)

వరంగల్‌ నగరానికి త్వరలో మెట్రో రైలు

హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా వరంగల్. దీంతో వరంగల్ నగరంలో కూడా మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 
మంత్రి కేటీఆర్‌ చొరవతో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు మహారాష్ట్రకు చెందిన మెట్రో రైలు ప్రతినిధులు బుధవారం నగరానికి వచ్చారు. వరంగల్‌ నుంచి కాజీపేట వరకు మెట్రో నిర్మాణం చేపట్టేందుకు కమిషనర్‌ పమేలా సత్పతితో GWMC (greater warangal municipal corporation) ఆఫీస్ లో చర్చలు జరిపారు. 
 
రూ.18వేల కోట్లకు పైగా అంచనాతో నిర్మించే ఈ ప్రాజెక్టుపై త్వరలో DPRను సిద్ధ చేస్తామని ప్రతినిధులు రాజీవ్‌, రామ్‌ కమిషనర్‌కు చెప్పారు. దీంతో వరంగల్‌ మహానగరంలో మెట్రో రైలు కోసం కీలక అడుగు పడింది.