శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (07:32 IST)

చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది: ఎమ్మెల్యే విడుదల రజని

ముఖ్యమంత్రివైయస్‌ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు.

శాసన మండలి రద్దు తీర్మానంపై సభలో ఆమె మాట్లాడారు.  "చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మంచి ప్రజాస్వామ్యంలో మనమందరం ఉన్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. మేనిఫెస్టోను వందకు వందశాతం నెరవేర్చేలా సీఎం వైయస్‌ జగన్ పనిచేస్తున్నారు.

ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు.  ఒక్క ముస్లిం మైనారిటీకి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది. మండలిపై చంద్రబాబు రెండు నాలుక సిద్ధాంతాన్ని చూపించారు.

ఆయనకు  ఒక స్టాండ్‌ అంటూ లేదు. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్‌ వ్యక్తులకు ఎమ్మెల్సీలు అమ్ముకోవచ్చు అన్న దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుకు వచ్చింది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు రాజకీయ ఉద్యోగం ఈ శాసన మండలినే ఇచ్చింది.

సీఎం వైయస్‌ జగన్‌ను తిట్టేందుకు మండలిని టీడీపీ నేతలు ఉపయోగించుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారితనంతో వ్యవహరిస్తోంది.  టీడీపీ నేతల మాదిరిగా మేం కూడా వ్యవహరిస్తే పోరాటం చేయమనండి" అని పేర్కొన్నారు