సంబంధిత వార్తలు
- జగన్ వద్దకు వెళ్లాల్సిన ఖర్మ లేదు.. ఆ మాట ఎవరు.. ఎందుకన్నారో తెలుసా?
- వైఎస్సార్, నేను ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నాం.. చంద్రబాబు
- జగన్ జైలులో వుంటే జైలు పరిపాలనా కేంద్రం అవుతుందా? టీడీపీ ఎమ్మెల్సీ
- రాష్ట్రానికి పట్టిన శనిని పట్టుకొని దేవుడు అంటావా? విజయ్చందర్కు చుక్కలు
- వైఎస్సార్ జన్మదిన కానుకగా శాసనమండలి పునరుద్ధరణ-తులసిరెడ్డి
ప్రజలకు జగన్ గురించి అర్థమైంది : చంద్రబాబు
ప్రజల గుండెల్లో నుంచి తెదేపాను తుడిచేయడం వైకాపాకు అసాధ్యమని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మండలిలో తెదేపా ఎమ్మెల్సీలు కోట గోడలా నిలబడి ప్రభుత్వ అనైతిక బిల్లులను అడ్డుకున్నారని అభినందించారు. 1984 నాటి పోరాటాన్ని ఎమ్మెల్సీలు తిరిగి గుర్తుచేశారని చంద్రబాబు అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
1984లో తెదేపా పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్న ఆయన... ఎమ్మెల్సీలు విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారని అభినందించారు.
రాజధానుల బిల్లుల వ్యవహారంలో నాటి పోరాటాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్సీలను అభినందించారు. పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో నిలిచి ఉంటాయన్న చంద్రబాబు.. ప్రలోభాలకు లొంగిన వారు తెరమరుగవుతారని స్పష్టం చేశారు.
పార్టీ కోసం పోరాడేవాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాళ్లంతా చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
తర్వాతి కథనం
