1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Anupama Parameswaran Opens Up About Toxic Relationship

రెండేళ్ల పాటు అలాంటి సంబంధంలో గడిపాను.. అపరిచితుడులా మారేవాడు.. అనుపమ

anupama
నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశ గురించి బహిరంగంగా మాట్లాడారు. తాను దాదాపు రెండేళ్లపాటు ఒక నార్సిసిస్టిక్ అతి అహంకారపూరిత, భావోద్వేగపరంగా వేధించే సంబంధంలో గడిపానని ఆమె వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో, తాను ఈ విషయాన్ని ప్రచారం కోసం లేదా దృష్టిని ఆకర్షించడం కోసం చెప్పడం లేదని, పైగా ఇలాంటి వేధింపులను గుర్తించలేక మౌనంగా బాధపడుతున్న వారిలో అవగాహన కల్పించేందుకే తన అనుభవాన్ని పంచుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. 
 
అనుపమ తన మాజీ భాగస్వామి గుర్తింపును వెల్లడించలేదు. గతంలో ఆమెకు నటుడు ధ్రువ్ విక్రమ్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సంబంధం గురించి చర్చిస్తున్నప్పుడు ఆమె అతని పేరు చెప్పలేదు. నార్సిసిస్టిక్ అబ్యూజ్‌ను గుర్తించడం తరచుగా కష్టమని, ఎందుకంటే అందులో ఎల్లప్పుడూ అరవడం లేదా శారీరక దాడి ఉండవని ఆ నటి వివరించారు. అపరిచితుడు సినిమాలోని పాత్రను ఉదాహరణగా తీసుకుంటూ, తన మాజీ భాగస్వామి ప్రవర్తన ఎంత తీవ్రంగా మారిపోయేదో అనుపమ వివరించారు. తాను తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నప్పుడు కూడా అతను చాలా నిర్లిప్తంగా, తనను పట్టించుకోనట్లుగా వ్యవహరించేవాడని ఆమె చెప్పారు. ఆ తర్వాత అతను క్షమాపణలు కోరడం, మళ్లీ అలా జరగదని హామీ ఇవ్వడం వంటివి చేసేవాడని అనుపమ తెలిపారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Faria Abdullah: సందీప్ కిషన్‌, ఫారియా అబ్దుల్లా పై ఓలమ్మో వగలాడి సాంగ్