1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Thief Hides Under Cot After Stealing Gold in Eluru

ఇంట్లో దొంగపడ్డాడు.. మంచంకింద దాక్కున్నాడు.. చివరికి అద్దం పగులకొట్టి...?

Thief
Thief
ఇంట్లో దొంగపడ్డాడు.. మంచం కింద దాక్కున్నాడు.. ఆపై దొరికిపోతామనే భయంతో కిటికీ అద్దం పగులకొట్టి పారిపోయాడు. ఏలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉంగుటూరు మండలం కొయ్యగురపాడు గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. 
 
ఒక దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలను అపహరించిన అనంతరం మంచం కింద దాక్కున్నాడు. సమాచారం ప్రకారం, ఆ దొంగ డొనేపూడి భాస్కర్ ఇంట్లోకి ప్రవేశించి గొలుసు, కడియం, ఉంగరం వంటి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. దొంగతనం చేసిన తర్వాత నిందితుడు మంచం కింద దాక్కున్నట్లు తెలిసింది. 
 
ఇంట్లో ఏదో కదలికను గమనించిన భాస్కర్, బయటి నుంచి తలుపుకు తాళం వేసి పొరుగువారిని పిలవడానికి వెళ్లాడు. అయితే, ఆ దొంగ కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఇంటి నుంచి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
శబరిమల ఆలయంలో బంగారం మాయంపై విచారణ చేసే ఎస్పీకి రాష్ట్రపతి పతకం