సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (16:06 IST)

జగన్ జైలులో వుంటే జైలు పరిపాలనా కేంద్రం అవుతుందా? టీడీపీ ఎమ్మెల్సీ

మూడు ముక్కల రాజధానిగా చేయడానికీ ఈ ప్రభుత్వం శాసనసభలో నిర్ణయించి పెద్దల సభలో నెగ్గలేకపోయిన ఆంధ్రరాష్ట్రంలో A2 ముద్దాయి వీసా రెడ్డి చైర్మన్ షరీఫ్ గారిని బాత్రూంకు వెళ్ళకుండా అడ్డుకుని చేతులుపట్టుకొని బ్రతిమలాడే పరిస్థితి ఏర్పడిందని.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.  
 
మాటమార్చను మడమ తిప్పను అనిచెప్పే ముఖ్యమంత్రి అబద్ధాలు పుట్ట అని, రాజధాని ఇక్కడి నుండి కదల్చడం మీ తరం కాదు అని తెలుసుకోవాలన్నారు. మానవత్వం లేకుండా నడుచుకుంటూ ఈ ముఖ్యమంత్రి, మంత్రులకు ఇంకా బుద్ధి రాలేదని.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే పరిపాలన అయితే నువ్వు జైల్లో ఉంటే జైలు పరిపాలనా కేంద్రం అవుతుందా? ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.
 
సీఆర్డీఏ రద్దు బిల్లు మీ నిర్ణయం తప్పు అని మీరు తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగ పట్ల గౌరవం లేదు అరాచకం, ప్రజల పట్ల సానుభూతి లేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల శాపం. నీ బెదిరింపులకు ఎవరు భయపడే అవకాశం లేదు. 5 కోట్ల రూపాయలు అడ్వకేట్‌కు ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా జగన్మోహన్ రెడ్డి? శాసనసభలో నిన్న శాసనమండలి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం.
 
శాసనమండలి తెలుగుదేశం పార్టీ సభ్యులు పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. శాసనమండలి సభ్యులు చరిత్రకారులయ్యారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారిని 24  మంది మంత్రులు చేసిన వత్తిడి ప్రజలు చూసారు. భారత దేశంలో నిజమైన బ్లాక్ డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటుంది.  ప్రత్యక్షప్రసారాలను ఆపివేసి మీరు చేసిన అరాచకం ప్రజలందరూ తెలుసుకొన్నారు.
 
అలాగే సీనియర్ అడ్వకేట్ కూడా చట్టపరంగా ఎక్కువ వివరించనక్కర్లేదు.  రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలకు తెలుసు. అసెంబ్లీలో మీకు మెజారిటీ ఉన్నా మీరు మండలి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. విశాఖవాసులు 507 మంది మాత్రమే శివరామకృష్ణన్ కమిటీ కి చెప్పడం జరిగింది. 5038 ఆంధ్ర ప్రజలు విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలని కోరుకున్నారు.
 
ఆ రోజు మండలి కూడా నిర్ణయం తీసుకుంది. సార్వభౌమ నిర్ణయాఅధికారం తెలుగుదేశం పార్టీ తీసుకొని రాజధాని నిర్ణయం అన్ని పార్టీల అనుమతితో నిర్ణయం తీసుకుంది. అధికార బలంతో జగన్ చేసిన నిర్ణయం చెల్లదు.
చట్టసవరణ చేయాలంటే సెలెక్ట్ కమిటీ చేస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మీరు చేసే అధికార మదం బలంతో నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో కుదరదు.

రాజ్యాంగ ఇచ్చిన రూల్ 71 మీద తీర్మానం చేసి చర్చించాలని చైర్మన్ చెప్పినా కూడా దానిని వాళ్ళకు అనుగుణంగా నిర్ణయం వచ్చింది అనుకున్న ysrcp సభ్యుల అవివేకం తేటతెల్లమైంది. ఇంత మేధావులు ఉన్న అధికార పక్షం భారతదేశంలో ఇప్పటివరకు చూడలేదు. చట్టాన్ని అతిక్రమించి మీరు చేసిన బిల్లు కాబట్టే మండలి వ్యతిరేకించింది.
మండలి రద్దు నిర్ణయం అమలు జరిగే లోపే నువ్వు జైలులో ఉంటావు జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు.