వైఎస్సార్ జన్మదిన కానుకగా శాసనమండలి పునరుద్ధరణ-తులసిరెడ్డి
పేదరాష్ట్రానికి మండలి అవసరమా? సీఎం ఎక్కడ ఉంటే అక్కడినుండి పరిపాలన చేయవచ్చు. రైతులకు వ్యతిరేకంగా మహిళలకు వ్యతిరేకంగా వాదించడానికి రూ. ఐదు కోట్లు వెచ్చించి అడ్వకేట్ అవసరమా అని అడుగుతున్నానని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు.
బొత్స సత్యనారాయణ పెద్దల సభ మనకు న్యాయం చేయకపోవడం నిజం దుర్మార్గం అనడం అత్యంత హేయం. సెలెక్ట్ కమిటీకి పంపితే మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
అభివృద్ధి అడ్డుకుందా విభజన చట్టంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలను శాసనమండలి అడ్డుకుందా. పెద్దల సభ ఎపుడు అభివృద్ధికి ఆటంకం కలిగించేవిధంగా ఎటువంటి నిర్ణయాలు చేయలేదు... అంటూ వ్యాఖ్యానించారు.
బొత్స సత్యనారాయణ పెద్దల సభలో తాబేదార్లు అనడం శాసనమండలి చరిత్రకు కళంకం. శాసనమండలి జులై 8 వ తారీకున 2004 వై.ఎస్. రాజశేఖర రెడ్డి జన్మదిన కానుకగా శాసనమండలి పునరుద్ధరించారు. ఆర్టికల్169 క్లాస్ 1 ప్రకారంగా మీరు చేస్తే చట్టం అవదు.
శాసనమండలి పార్లమెంట్ యొక్క నిర్ణయం ప్రకారమే రద్దు చేయబడుతుందనే విషయం మీకు అర్ధం కాలేదు. శాసనసభ తొందరపాటు నిర్ణయాలు నియంత్రణ కోసమే శాసనమండలి పెద్దల సభ. చారిత్రక తప్పిదానికి చేసి చరిత్ర హీనులు కావద్దు అని హెచ్చరిస్తున్నానని తులసిరెడ్డి చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం చారిత్రక తప్పిదమని.. అందుకే శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపుతూ బ్రేక్ వేసిందని తులసిరెడ్డి వెల్లడించారు.