జగన్మోహన్ రెడ్డి పాలన పంటినొప్పికి తుంటి మీద తన్నినట్లుంది.. (video)

tulasi reddy
ఎం| Last Updated: మంగళవారం, 21 జనవరి 2020 (19:06 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఒక అవకాశం ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఉత్తరకుమారా ప్రగల్భాలు పలికారు. విభజన చట్టంలో ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ వస్తే అభివృద్ధి కాదా? పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే అభివృద్ధి కాదా వికేంద్రీకరణ కాదా?మూడు రాజధానులంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి తెలిపారు.

ఇంకా కర్నూలులో హైకోర్టు రాజధానా? అసెంబ్లీ హైకోర్టు పరిపాలనా క్రింద రాజధాని కాదా అసెంబ్లీ అమరావతి విశాఖపట్నం ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని దీనికి ఎలా సమర్ధించుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన జగన్ మీరు రాజధానిని మారుస్తాము అంటే మీకు 151 సీట్లు వచ్చేవికాదు కేవలం 21 సీట్లు వచ్చేవి.

చంద్రబాబు జగన్మోహన్ ఇద్దరు రాయలసీమ ద్రోహులుగా చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. 2014లో శ్రీబాగ్ ఒప్పందాన్ని మీరు ఎందుకు ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి? కాంగ్రెసు హయాములో జరిగిన ప్రాజెక్టులను పూర్తిచేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అయివుండేదని తులసీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.
దీనిపై మరింత చదవండి :