శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (08:19 IST)

మంత్రి బుగ్గనకు చంద్రబాబు ప్రశంస... ఎందుకో తెలుసా?

మంత్రి బుగ్గన చాలా తెలివైనవాడని.. అవసరమైతే నిపుణుల కమిటీ అంటాడని.. లేదంటే నిపుణుల కమిటీ చెప్పాలా? అంటూ ఎదురుదాడి చేస్తాడని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాడ్లాడుతూ ‘‘రాయలసీమ వాళ్లకు బెంగళూరు, హైదరాబాద్‌ దగ్గర విశాఖపట్నం చాలా దూరమని చంద్రబాబు అన్నారు. సభ్యులు ఒక్కొక్కరు గంటాగంటన్నార సేపు తిట్టారు. జనం కోసం వాదన విన్పిస్తుంటే సమయం ఇవ్వడంలేదు. వైసీపీ నేతలు ఆరోపణలకు నేను సమాధానం చెప్తా. నాకు సమయం ఇవ్వండి.

అమరావతి మునిగిపోతుందని రిపోర్ట్‌ ఇవ్వలేదని మద్రాస్‌ ఐఐటీ తేల్చి చెప్పింది. అయితే వైసీపీ చెప్పేవన్నీ బోగస్‌ కబుర్లు. మద్రాస్‌ ఐఐటీ రిపోర్ట్‌ ఇచ్చిందని బోగస్‌ మాటలు చెబుతున్నారు. అయినా అమరావతి నేలల్లో పటుత్వం లేదని, ఐఐటీ మద్రాస్‌ చెప్పాలా? మాకు తెల్వదా?

ప్రపంచంలోని 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనుకున్నా. అసెంబ్లీ, సచివాలయం ఐకానిక్‌ భవనాలుగా ఉండాలనుకున్నా. ఇప్పుడున్న ఈ అసెంబ్లీ, సచివాలయ ట్రాన్సిట్‌ భవనాలు. ట్రాన్సిట్‌ అంటే టెంపరరీ అని కాదు. జగన్‌ పార్టీ వాళ్లకు భాష రాక, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు.’’ అని అన్నారు.