మచిలీపట్నం వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు

chandrababu jole
ఎం| Last Updated: గురువారం, 9 జనవరి 2020 (18:01 IST)
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ‘అమరావతి పరిరక్షణ సమితి’ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. రాజధాని ఉద్యమం కోసం మచిలీపట్నంలో తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఐకాస నేతలు ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు. కోనేరు సెంటర్‌ వద్ద కాలినడకన తిరుగుతూ జోలెపట్టి విరాళాలు సేకరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారంతా నినాదాలు చేశారు. బందరు వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు బందరు వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు మరోవైపు రాజధాని కోసం గుంటూరులో విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, మహిళలు రోడ్లపైకి తరలివచ్చి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
దీనిపై మరింత చదవండి :