శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (15:36 IST)

పాతాళానికి జారిపోయావు బాబూ..!

టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో చేసిన కుట్ర బయటపడిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌లో 'బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు నాయుడు తెగబడ్డాడు. బీసీజీ వికీపీడియా ప్రొఫైల్‌ను ఎడిట్ చేయించి సీఎం జగన్‌మోహన్ రెడ్డికి 50 శాతం వాటాలున్నాయని రాయించాడు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని 'ది హిందూ' పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారిపోయావు బాబూ!" అంటూ ట్వీట్‌ చేశారు.
 
దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. దళితులన్నా, బలహీన వర్గాల వారన్నా చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపే. ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించాడు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషించడం చూస్తే అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి పరివర్తన రాలేదని తెలుస్తోంది అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో ఎండగట్టారు.