గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (16:13 IST)

ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. ఇవే..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 
 
* 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు.
* పంచాయతీ ఎన్నికల నిర్వాహణ కోసం రిజర్వేషన్ల ఖరారు. 
* కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్ బోర్డుకు 4 ఎకరాలు కేటాయింపు. 
* మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. 
 
* 412 కొత్త 108 వాహనాలు కొనుగోలు. మార్చి 31లోపు కొనుగోలు చేసేందుకు రూ. 71 కోట్ల 48 లక్షలను నిధులు కేటాయింపు. 
 * 104 వాహనాలు (656) కొనుగోలు. ఇందుకు రూ. 60 కోట్ల 51 లక్షలతో నిధుల కేటాయింపు. 
* వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలుకు కొత్త విధానం. 
* రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను, 150 ఉప మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని నిర్ణయం. 
* పసుపు, మిర్చీ, ఉల్లి, చిరుధాన్య పంటలకు ప్రతి సంవత్సరం మద్దతు ధర ముందే ప్రకటిస్తాం. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.