బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:33 IST)

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ రూపకల్పన చేశారు. ప్రతిపాదనలు పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొటేషన్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైల్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో 79.9కిలోమీటర్ల నిర్మాణం కోసం కొత్త డీపీఆర్ తయారీకి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

డీపీార్ రూపకల్పనకు ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్షియంకు ఇచ్చిన ఉత్తర్వలు రద్దు చేశారు. ప్రతిపాదనల తయారీకి ఢిల్లీ మెట్రో, రైట్స్, యూఎంటీసీని సంప్రదించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

మూడు కారిడార్లలో మెట్రో నిర్మాణం కోసం డీపీఆర్ లను రూపకల్పన చేయనున్నారు.