శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:32 IST)

చంద్రబాబు బినామి సంస్థలో జగన్ పెట్టుబడులు ఎందుకు?!: లోకేశ్ చురకలు

వైకాపా ఎంపీ మిథున్​రెడ్డి లోక్​సభలో చేసిన ప్రసంగంపై ట్విట్టర్​ వేదికగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చురకలు వేశారు. సంస్థ పేరు కూడా తెలుసుకోకుండా పార్లమెంటులో వైకాపా ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని ఎద్దేవా చేశారు.

ఉత్తరాంధ్ర యువతకు మంచి సంస్థలో ఉద్యోగాలు రావడం వైకాపా నాయకులకు రుచించడం లేదని ధ్వజమెత్తారు. వైకాపా ఎంపీలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. లోక్​సభలో వైకాపా ఎంపీ మిథున్​ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ పేరును తప్పుగా పలకడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

'అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు.. ఆ సంస్థ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కనీసం పేరు తెలుసుకోకుండా 'ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ సంస్థ' అంటూ పార్లమెంటులో వైకాపా ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసింది.

ఫ్రాంక్లిన్ చంద్రబాబుగారి బినామీ సంస్థ కదా.. అలాంటి దానిలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని వైఎస్​ జగన్​ను నిలదీయండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఎంపీ గారు..! ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం జగన్​కి మొదటి నుంచి ఇష్టం లేదు.

ఉత్తరాంధ్ర యువతకి మంచి సంస్థలో ఉద్యోగాలు రావడం వైకాపా నాయకులకు రుచించడం లేదు. ఎప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండాలి అనే దురుద్దేశంతో సంస్థలు రాకుండా అడ్డుపడుతున్నారు.

బినామీ సంస్థలు అంటూ ఆరోపిస్తున్నందునే అవి జగన్​ను చూసి బైబై ఏపీ అంటున్నాయి' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రాంక్లిన్ టెంపుల్​టన్ సంస్థలో సీఎం 9కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఎన్నికల అఫిడవిట్ ట్విట్టర్​లో జత చేశారు.