శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (08:02 IST)

ఉత్తమ 20 నగరాల జాబితాలో 'విశాఖ'

దేశంలోని 20 ఉత్తమ నగారాల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం చోటు సంపాదించింది.

అభివృద్ధి చెందాల్సిన 20 నగారాలతో ఉత్తమంగా నిలిచిన టాప్ 20 నగరాలు కలిసి పనిచేయాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

దేశంలోని 20 ఉత్తమ నగరాలు.. అభివృద్ధి చెందాల్సిన 20 నగరాలతో సిస్టర్ సిటీస్‌గా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి 20 వరకు ఈ 20 నగరాలు అభివృద్ధి చెందాల్సిన మరో 20 నగరాలతో ఒప్పందం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అయితే.. మతం, సంస్కృతి పరంగా సారూప్యత ఉన్న నగరాలే కలిసి పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

2015లో ప్రవేశపెట్టిన స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా... ఆధునిక సౌకర్యాలున్న నగరాలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.

అహ్మదాబాద్, నాగ్‌పూర్, విశాఖపట్నం, వడోదర, వారణాసి, అమరావతి సహా..20 నగరాలు బెస్ట్ పర్‌ఫార్మింగ్‌ నగరాల జాబితాలో ఉన్నాయి.