శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:49 IST)

మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే: మంత్రి పిల్లి సుభాష్‌

మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. బిల్లు పాస్‌ చేయాలని, లేదంటే బిల్లు తిరస్కరించాలని, లేదంటే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని చెప్పారు.

రెండు, మూడు ఆప్షన్లు లేవు కాబట్టి బిల్లు పాస్‌ అయినట్టేనని పేర్కొన్నారు. బిల్లులను గవర్నర్‌కు పంపిస్తామని తెలిపారు. మండలి ఛైర్మన్‌, అధికారాలను దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదన్నారు.

సందిగ్ధంలో ఉన్నప్పుడు మాత్రమే విచక్షణాధికారాలు వర్తిస్తాయని విమర్శించారు. ఓటింగ్‌ జరగకుండా సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.

సెలెక్ట్‌ కమిటీని చూసి భయపడాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని, 14 రోజులు ముగిశాయి కాబట్టి బిల్లులు ఆమోదం పొందినట్టేనని సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.