ముస్లీంలు మండలి చైర్మన్‌గా ఉండకూడదా?

tdp
ఎం| Last Updated: బుధవారం, 29 జనవరి 2020 (08:37 IST)
ముస్లీం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి శాసన మండలి చైర్మన్‌గా ఉండకూదన్న అక్కసుతోనే వైసీపీ ప్రభుత్వం మం డలిని రద్దు చేసేందుకు తీర్మానం చేసిందని మంగళగిరి అంజుమన్‌ మాజీ అధ్యక్షుడు, టీడీపీ మైనార్టీ సెల్‌ నేత ఎండీ ఇక్బాల్‌ అహ్మద్‌ ఆరోపించారు.

మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాది మంది రైతుల ఆవేదనలు, మహిళల ఆర్త నాదలను గుర్తించి అమరావతికి అనుకూలంగా మం డలి చైర్మన్‌ షరీఫ్‌ ఎంతో నిబద్ధతతో వ్యవహరించారని చెప్పారు.

ఇది జీర్ణించుకోలేని సీఎం జగన్‌, ఆయన మంత్రివర్గం తమ కుటిల రాజకీయ ఎత్తుగడలతో ఏకంగా మండలినే రద్దు చేస్తామనడం దుర్మార్గ మన్నారు. సీఎం జగన్‌ పాదయాత్రలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన చేస్తున్నాడని మండిపడ్డారు.

సభ సాక్షిగా చైర్మన్‌ షరీఫ్‌ను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు మతం పేరుతో దూషించి, దౌర్జన్యం, దాడి చేసే వరకు వెళ్లారని, అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ ఇబ్రహీం మాట్లాడుతూ మండలి చైర్మన్‌ షరీఫ్‌ను వైసీపీ ప్రభుత్వం అవమాన పర్చడం యావత్‌ ముస్లీం మైనార్టీ వర్గాలపై జరిగిన దాడిగా అభి వర్ణించారు. తక్షణమే శాసన మండలి రద్దు అంశాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

సమావేశంలో టీడీపీ నియోజకవర్గ పూర్వ ఇన్‌చార్జి పోతి నేని శ్రీనివాసరావు, మైనార్టీ సెల్‌ నాయకులు పఠాన్‌ నజీరుల్లా ఖాన్‌, షేక్‌ రియాజ్‌, పఠాన్‌ ఖాశీంఖాన్‌, జానీఖాన్‌, కట్టెపోగు రత్నమాణిక్యం, మహబూబ్‌ సుబానీ, మహ్మద్‌ సలాం, షేక్‌ ఇంతియాజ్‌, హాజీ కరీముల్లా, నాగుల్‌మీరా, అమీర్‌, బేగ్‌, సులేమాన్‌, ఇస్మాయిల్‌, పఠాన్‌ జబీబుల్లా ఖాన్‌, ఖాదర్‌, ఆరిఫ్‌, అనిష్‌, ఖాదరీ తదితరులు పాల్గొన్నారు.
దీనిపై మరింత చదవండి :