గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (08:07 IST)

ఏపిలో మండలి రద్దుపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!?

ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్యను సృష్టించి, దాని చుట్టూ ప్రజలను తిప్పుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడో సెటిల్ అయిన రాజధాని విషయాన్ని పట్టుకుని, దాన్ని కదిపి, అన్ని ప్రాంతాల ప్రజలను గందరగోళంలో పడేసారు.

రాజధాని సమస్య జటిలం అవ్వటంతో, ఒక తప్పుకు పది తప్పులు అన్నట్టు చివరకు తమకు అడ్డుగా ఉన్న మండలిని కూడా రద్దు చేస్తూ తీర్మానం చేసారు. ఇలా అనేక విధాలుగా ఏపి ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తుంది.అయితే ఈ విషయం పై 47 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు ఢిల్లీ వెళ్లారు.

అక్కడ అందరినీ కలుస్తూ తమకు జరిగిన అన్యాయం పై మొర పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసారు అమరావతి రైతులు. తాము తీవ్రంగా నష్ట పోతున్నామని, తమను ఆదుకోవాలని కోరారు.

దీని పై స్పందించిన కిషన్ రెడ్డి శాసనమండలి రద్దు కాని, 3 రాజధానుల అంశంపై కాని, ఇప్పటి వరకు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి ఆఫిషయల్ గా ఏమి చెప్పలేదని చెప్పారు.
 
రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నం వద్దకు మార్చేస్తుందని, దీని కారణంగా మాకు అనేక రకాలుగా నష్టం జరిగే అవకాశం ఉంది. మేము రాజధాని కోసం భూములు ఇచ్చాం, మా భూములు త్యాగం చేసాం.

"ఈ రోజు, రాజధాని లేదని చెప్పటంతో, మేము మా కుటుంబ సభ్యులు, ఎంతో అన్యాయానికి గురి అవుతున్నాము, బాధ పడుతున్నాము అని చెప్పి, అమరావతి పరిరక్షణ సమితి రైతులు, అనేక విషయాలు చెప్పటం జరిగింది.

ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అఫిషయల్ గా కేంద్ర ప్రభుత్వానికి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రానికి ఏ రకమైన సమాచారం ఇవ్వలేదు. అలాగే ప్రభుత్వాన్ని పక్కన పెడితే, పార్టీగా బీజేపీ రాష్ట్ర శాఖ ఒక తీర్మానం చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిలోనే ఉండాలి అంటూ, అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తీర్మానం చేసాం.

కాబట్టి ఈ విషయం పైన, కేంద్ర ప్రభుత్వం తరుపున, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు వివరాలు ఇస్తేనే స్పందించే అవకాసం ఉంటుంది.
 
"నేను కూడా వ్యక్తిగతంగా ప్రధాని మంత్రితోటి, హోం మంత్రితోటి, బీజేపీ జాతీయ అధ్యక్షుల వారితోటి, మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వంతో, ఏ రకంగా చర్చించాలో ఆలోచిస్తాం.

ఇది రాష్ట్ర ప్రభుత్వ అంశం అయినప్పటికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ కూడా వేలాది మంది రైతులు, వేల ఎకరాలు భూములు ఇచ్చారు కాబట్టి, రైతుల యొక్క మనోభావాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టిలో పెట్టుకోవాలి, స్వయంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయం పై ఆలోచించాలి.

అధికార వికేంద్రీకరణ చెయ్యాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. రాజధానిని ముక్కలు చేసినంత మాత్రాన, అధికార వికేంద్రీకరణ జరగదు. అధికార వికేంద్రీకరణ జరగాలి అనేది మా విధానం. కాని పరిపాలన రాజధానిగా కాదు.

ఢిల్లీని ముక్కలు చేసి, వేరే చోట్ల పెట్టలేం కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచిస్తే మంచిది అని నా అభిప్రాయం" అని కిషన్ రెడ్డి అన్నారు.