శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (14:54 IST)

ప్లీజ్.. వ్యభిచార రొంపిలో నన్ను భాగస్వామిని చేయొద్దు.. హీరోయిన్ వినతి

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన సెక్స్ స్కామ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, చిన్నచిన్న నటీమణుల పేర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, వ్యభిచారం చేసేందుకు ఇష్టపడని ఆ నట

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన సెక్స్ స్కామ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, చిన్నచిన్న నటీమణుల పేర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, వ్యభిచారం చేసేందుకు ఇష్టపడని ఆ నటి... సెక్స్ రాకెట్ నిర్వాహకుడికి ఓ మెయిల్ రాస్తూ, ప్లీజ్ ఈ స్కామ్‌లో నన్ను భాగస్వామిని చేయొద్దు.. అదేవిధంగా మానసిక క్షోభకు గురిచేయొద్దు అని వేడుకుంటూ రాసింది. 
 
ఈ మెయిల్‌ను పోలీసులు గుర్తించారు. అయితే, ఈ మెయిల్ రాసిన నటి ఎవరన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుందని.. ఇప్పటి వరకు ఎంత డబ్బు చేతులు మారింది.. ఎంత మంది పాత్ర ఉంది అనేది విచారణ చేస్తున్నారు. 
 
కాగా, తెలుగు ఇండస్ట్రీనే కాకుండా అమెరికాలోని ఎన్నారైలను ఓ కుదుపుకుదిపిన ఈ స్కామ్‌ను ఎన్నారై కిషన్ మోదుగుమూడి అలియాస్ శ్రీరాజు చెన్నుపాటి, ఆయన భార్యలు నిర్వహిస్తూ వచ్చారు. వ్యభిచార విడిదిగా తమ నివాసంతో పాటు.. ఖరీదైన లగ్జరీ హోటల్స్‌ను వినియోగిస్తూ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.